Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి  ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే..!

TTD SPECIAL ENTRY DARSAN BOOKINGS
Advertisement
  • 25న మే, జూన్ నెలకు సంబంధించి రూ.300 దర్శనం టికెట్లు 
  • 26న తిరుమలలో అకామిడేషన్ బుకింగ్ లు ప్రారంభం
  • 24న ఆన్ లైన్ సేవా కమ్ దర్శన్ టికెట్ల బుకింగ్ లు మొదలు
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆన్ లైన్ సేవా దర్శనం కోటా, అకామిడేషన్ విడుదల తేదీ వివరాలను ప్రకటించింది. మే, జూన్ నెలలకు సంబంధించి రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే, మే నెలకు సంబంధించి ఆన్ లైన్ సేవా, దర్శనం టికెట్ల కోటాని ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. 

ఇందులో రూ.300 అనేది ప్రత్యేక దర్శనానికి సంబంధించినది. ఆన్ లైన్ సేవా కమ్ దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారికి శ్రీవారి దర్శనం అందులో భాగంగా ఉంటుంది. ఈ కోటా కింద కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఉన్నాయి. ఈ టికెట్ ను కొనుగోలు చేసిన వారు వర్చువల్ గా సేవను చూడొచ్చు. అనంతరం స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి పంపిస్తారు. ఇక జూన్ నెలకు సంబంధించి ఆన్ లైన్ సేవా కమ్ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 

ఇక మే, జూన్ నెలలకు సంబంధించి తిరుమలలో అకామిడేషన్ బుకింగ్ ను ఈ నెల 26న ఉదయం 10 గంటల నుంచి అనుమతించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. టీటీడీ ఆన్ లైన్ పోర్టల్ లేదా టీటీదేవస్థానమ్స్ యాప్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు.
Advertisement
Advertisement
TTD
TIRUMALA
DARSAN
BOOKINGS

More Telugu News